Hot Posts

6/recent/ticker-posts

శ్రీ అన్నపూర్ణ విశాలక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి 28వ శివరాత్రి కళ్యాణ మహోత్సవ కరపత్రాల ఆవిష్కరణ


టి నరసాపురం, పశ్చిమ వాహిని: : టి. నరసాపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ విశాలక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం నందు 28వ శివరాత్రి కళ్యాణ మహోత్సవ కరపత్రాలను. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో చైర్మన్ కమిల రమేష్ రాజు అధ్యక్షతన శివ భక్తులు జడ్పిటిసి సభ్యులు సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు, దేవరపల్లి ముత్తయ్య, టి నరసాపురం సర్పంచ్ సునంద, తాసిల్దార్ సుభాష్, విద్యుత్ అధికారి దాసరి శ్రీనివాస్, వైద్య అధికారిని జె.కల్పన రాణి, పోలీస్ సిబ్బంది, సూర్యనారాయణ రాజు, హెడ్ కానిస్టేబుల్ రాజు, చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, పసుమర్తి రాము పర్వతనేని మురళి మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా భక్తుల సహకారంతో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడంతోపాటు అఖండ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని. అందులోనే భాగంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన ధ్వతి స్తంభా పున ప్రతిష్ట కార్యక్రమం కూడా ఉన్నదని ప్రతిష్ట కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వివరించారు.

ఈ సంవత్సరం 28వ శివరాత్రి కళ్యాణ మహోత్సవాలు ఐదు రోజులు పాటు నిర్వహిస్తున్నామని మార్చ్ ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు ఐదు రోజులపాటు ఉత్సవాలు భక్తులు సహకారంతో నిర్వహిస్తున్నట్లు వివరించారు. కరపత్రాల ఆవిష్కరణకు విచ్చేసిన అధికారులకు ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు దుశ్యాలువాతో సత్కరించారు. వచ్చిన భక్తులకు రంగనాథ్ శర్మ వినయ్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ చైర్మన్ నెల్లూరు శ్రీనివాస్, ధర్మకర్తల మండలి నెంబర్ వెజ్ బాలరాజు, అద్దంకిరామకృష్ణ, మహేశ్వరరావు, పెద్దిన సత్యనారాయణ, అనుమాలు రామ్మోహన్రావు, లింగారెడ్డి శ్రీనివాస్, ఆత్కూరి శివ సత్యనారాయణ, ముళ్ళపూడి సుబ్బారావు, బచ్చు సూర్యనారాయణ, భక్తులు, తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.