ఏలూరు: ఓటు హక్కు ఉన్న ప్రతి వారు తప్పని సరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఏలూరు ఎలక్షన్స్ డిప్యూటీ తహసిల్దార్ లాం విద్యసాగర్ అన్నారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం డిగ్రీ కళాశాల విద్యార్థులతో స్వీప్ (Systematic Voters Education and Electoral Participation) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 17సం॥ నిండిన విద్యార్థులు అందరు ఓటరుగా నమోదు కావచ్చునని, 18 సం|| నిండిన తరువాత ఓటు హక్కు కల్పించబడుననియూ, ఓటు హక్కు ఉన్న ప్రతివారు తప్పని సరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నరు. కుల, మత, ప్రాంత లకు అతితముగా విద్యార్థుల భవిష్యత్తు తీర్చి దిద్దే ప్రతిభావంతులను ఎన్నుకోవడము ద్వారా ప్రజాస్వామ్యని పరిరక్షించుకొనవలన్నారు. పోలింగ్ రోజున వాతావరణం అనుకూలంగా లేదు అని అనగా ఎండ, వాన, చలి కారణములు చేత, ఓటు హక్కును వినియోగించుకోకపోవడం వలన ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని తెలియజేసారు. విద్యబుద్ధులతో పాటు ఓటు హక్కును వినియోగించుకొన విషయములో భాద్యతగా ఉండవలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.గిరి బాబు, వైస్ ప్రిన్సిపాల్ కె. అజయ్ కుమార్, కళాశాల అధ్యాపకులు, కళాశాల
బోధనేతల సిబ్బంది పాల్గొన్నారు.