కాకినాడ జిల్లా గండేపల్లి: మండలంలోని బొర్రంపాలెం గ్రామంలో మాజీ జడ్పిటిసి సభ్యులు యర్రంశెట్టి వెంకటలక్ష్మి బాబ్జి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పల్లపు శ్రీను, మాజీ సొసైటీ డైరెక్టర్ యర్రంశెట్టి పండు, యర్రంశెట్టి శ్రీను, యర్రంశెట్టి రాజు, మంగిన కొండయ్య, పల్లపు చిన్ని, తదితర 25 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ముందుగా బొర్రంపాలెం వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు, పోరాటయోధులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలుపుకు పాతా కొత్త కలయికలు అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. తను ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాలుగు ప్రధాన అంశాలుగా ఎన్నికలకు వెళ్తున్నానని ఆ నాలుగు అంశాలు మొదటి అంశం ఈ ప్రాంతానికి పుష్కలంగా తాగునీరు సాగునీరు అందించడం రెండవ అంశం ఒక యూనివర్సిటీ తీసుకొచ్చి మంచి విద్యా ప్రమాణాలు అందిస్తానని మూడవ అంశం భారీ పరిశ్రమలు తీసుకొచ్చి 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మరియు నాలుగవ అంశం పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తీసుకొస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, అడబాల భాస్కరరావు, దాపర్హి సీతారామయ్య యల్లమిల్లి సీఎం, పల్లపు సుబ్బారావు, య ర్రంశెట్టి ఏసు, తదితరులు పాల్గొన్నారు.