Hot Posts

6/recent/ticker-posts

చింతలపూడిలో అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ అర్ధనంగా ప్రదర్శన


 ఏలూరు జిల్లా : చింతలపూడి మున్సిపల్ కార్మికుల సమస్యలు మరియు అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చింతలపూడిలో పాత బస్టాండ్ వద్ద నుంచి బోసుమ సెంటర్ వరకు అర్ధనంగా ప్రదర్శన నిర్వహించారు ఈ అర్థనంగా ప్రదర్శనను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన  కార్యదర్శి తుర్లపాటి బాబు మాట్లాడుతూ గత 24 రోజులుగా అంగన్వాడీలు గత మూడు రోజులుగా మునిసిపల్ సిబ్బంది సమ్మె చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం వీరిపై కనికరం లేదని వీరికి కనీస వేతనం 26,000 సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వీరి సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కార్మిక సంఘాలను వివిధ స్వతంత్ర సంస్థలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈరోజు ఉదయం ఏఐటీయూసీ సమ్మె శిబిరాన్ని జనసేన టిడిపి సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ సిపిఐ నాయకులు సందర్శించి మద్దతు తెలియజేశారు సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ నాయకులు డి రంగనాథ్ జనసేన నాయకురాలు భారతి టిడిపి పట్టణ అధ్యక్షులు పక్కా వెంకటేశ్వరరావు కార్యదర్శి గోడ నాగభూషణం ఐ టీడీపీ అధ్యక్షులు బోడ  అనీష్ టిడిపి నాయకులు మారుమూడు థామస్ టిడిపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కర్లపూడి రాజరత్నం రమేష్ తదితరులు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గంధం అంజమ్మ కోశాధికారి ఆర్ మరియమ్మ విజయలక్ష్మి మల్లేశ్వరి మున్సిపల్ కార్మికులు వెలగాడి అనురాధ శ్రీరామ్ కోటయ్య ఒడిత్య బాలు వదిలి చిన్నన్న పార్వతి మానుకొండ సర్వేశ్వరరావు గంధం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


రిపోర్టర్

టీ. బాలస్వామి

పశ్చిమ వాహిని

చింతలపూడి