Hot Posts

6/recent/ticker-posts

పెంచిన నూతన పింఛను పెంపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మల్యే బాలరాజు, ఇన్చార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి



 టి. నరసాపురం: ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం టి-నర్సాపురం మండలంలో నూతన పింఛను పెంపు కార్యక్రమం, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నందు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి బాలరాజు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారులకు ప్రతినెల మొదటి తేదీ ఉదయమే గుడ్ మార్నింగ్ చెప్పి వైయస్సార్ పెంక్షన్ కానుక 3 వేల రూపాయలను ఇంటి ముందుకే అందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ పెంక్షన్ కానుకను దశలవారీగా 3000 వరకు పెంచినట్లు తెలిపారు..


గత ప్రభుత్వం ఎన్నికల ముందు రెండు నెలల వరకు 1000 రూపాయలు పెంక్షన్లు రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మందికి మాత్రమే అందించారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే 2250కి  పెంక్షన్ పెంచారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 66.34 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం పెంక్షన్లో 400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ప్రస్తుత ప్రభుత్వం నెలకు 2000 కోట్లు ఖర్చుచేస్తుంది అంటే పేదల సంక్షేమoపై రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శమని పేర్కొన్నారు.


పోలవరం నియోజకవర్గంలో కేవలం టి-నరసాపురం మండలంలో మొత్తం 7,920 మంది పింఛను లబ్ధిదారులకు గాను డిసెంబర్ నెలలో 2కోట్ల 21లక్షల 24వేల 750రూపాయలు నేరుగా ఇంటికి తీసుకువెళ్లి వాలంటీర్స్ అందించారని అన్నారు. నేటి నుంచి పెంచిన పింఛను సొమ్ము చెక్కును అందించారు. టీ-నర్సాపురం మండలంలో రెండు కోట్ల 37 లక్షల 60 వేల రూపాయలను నేటి నుండి వాలంటీర్స్ పంపిణీ చేస్తారు అని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి సభ్యులు సమంతపూడి సూరిబాబు, మండల ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గృహసారథులు, మండల జెసిఎస్ కన్వీనర్లు, వార్డ్ మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఎంపీపీ, సొసైటీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు, అధికారులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.



ప్రతినిధి