ఏలూరు జిల్లా : చింతలపూడి అంగన్వాడీల సమ్మె 24 రోజుకు చేరింది.ప్రభుత్వం నుండి అధికారులనుండి ఎన్ని బెదిరింపులు ఎదురైనా తాము అనుకున్నది సాధించేవరకు సమ్మే కొనసాగిస్తామని వెనకడుగు వేసే ప్రసక్తి లేదని అంగన్వాడి కార్యకర్తలు నినాదాలు చేశారు.ఐదో తేదీలోపు విధులకు హాజరు కాకపోతే శాఖ పర్యమైన చర్యలు తీసుకుంటామని ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అంగన్వాడీలకు కనీస వేతనం రూపాయలు 26000 చెల్లించాలని అంగన్వాడి నాయకులు డిమాండ్ చేశారు.రాబోయే రోజుల్లో ఉద్యమO తీవ్రంగా చేస్తామని ప్రాజెక్ట్ యూనియన్ నాయకులు N.సరోజిని,T.మాణిక్యం,, సరళ, కవిత, అరుణ, హేమలత, పద్మ తదితరులు నాయకత్వం వహించారు.
కలెక్టర్ అంగన్వాడిలను బెదిరింపు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వు కాపీలను దహనం చేశారు.
రిపోర్టర్
టీ. బాలస్వామి
పశ్చిమ వాహిని
చింతలపూడి