డాక్టర్ రాజాన మాట్లాడుతూ, అమ్మ వారి రజత (వెండి) వస్త్ర తయారీకి వనచర్ల హనుమంతరావు, ఉష దంపతులు (ముప్పినవారిగూడెం)5తులాల వెండి, బండారు నాగరాజు, నాగ కరుణ కుమారి దంపతులు(చిన్నంవారిగూడెం)5తులాల వెండి, మరియు కూన పార్వతి 10తులాల వెండి అమ్మ వారికి సమరించారని, వారినీ వారి కుటుంబ సభ్యులను అమ్మ వారు ఎల్లవేళల కాచి కాపాడాలని కోరారు.
ప్రగళ్ళపాటి వీర రాఘవులు, విశాలాక్షి మరియు ప్రగళ్ళపాటి వీర వెంకట గంగాధర్, వెంకట లక్ష్మీ కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధికీ రూ 25,116/లు విరాళంగా ఇచ్చారని తెలిపారు. దాతలకు అమ్మ వారి శేష వస్త్రాన్ని, చిత్ర పటాన్ని, ప్రసాదాలు ఇచ్చి వేద పండితుల ఆశీర్వాదంతో ఘనంగా సత్కరించామని తెలియజేశారు. భక్తులందరూ అమ్మ వారికి వెండి రూపంలో గాని ధన రూపంలోను ద్రవ్య రూపంలో మరియు వస్తు రూపంలో సహకరించాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు,మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, శ్రీనూకాంబిక సేవాబృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రసాద వితరణ చేశారు అని ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపరు.
ప్రతినిధి