Hot Posts

6/recent/ticker-posts

వినుకొండలో రెచ్చిపోయిన టిడిపి అనుచరులు


 జీవి ఆంజనేయులు ఆదేశాలతో వైసీపీ కార్యకర్తలపై టిడిపి వ్యక్తులు దాడులకు పాల్పడిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. దాడిలో గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి ఆయన పరామర్శించిన, అనంతరం మీడియతో మాట్లాడుతూ.. జీవి ఆంజనేయులు అనుచరులు పక్కా పధకం ప్రకారం దాడిచేసి హత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.


ఓటమి భయంతో జీవి ఆంజనేయులు గొడవలకు పాల్పడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకపు పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారని అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆసిఫ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించి చంపడానికి ప్రయత్నించారని, నిన్ను, మీ ఖాన్ వెంట తిరిగే ప్రతి ఓక్కరిని ఇలాగే కొట్టి చంపేస్తాం అంటూ బెదిరించారని, అతను వారి నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు.


అసిఫ్ అనే వ్యక్తి కచ్చితంగా ఖాన్ దగ్గరకే వెళ్తాడని తెలుసుకొని, అతని అనుచరులు ఆసిఫ్ దగ్గరకు వచ్చే సమయం చూసి పక్కా ప్రణాళికతో పి ఎస్ ఖాన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అతనిని చంపాలనే ఉద్దేశంతో కర్రలు రాడ్ లు కత్తులు వంటి మారణాయుదాలతో పి ఎస్ ఖాన్ పై కూడా దాడికి పాల్పడి ఖాన్ ని గాయపరిచారని ఆరోపించారు. ఇది అంత పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని, దెబ్బలతో హాస్పిటల్ లో ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని, ఈవిధంగా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు.


అదే విధంగా పి ఎస్ ఖాన్ జోలికి గాని, మా పార్టీ కార్యకర్తలకు జోలికి గాని వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు, లోకేష్ కుట్రలో భాగమేనని అన్నారు. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద నామినేట్ పదవి ఇస్తానని వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి గ్రామీణ ప్రాంతాలలో అలజడులు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేదే ప్రధాన ఉద్దేశంగా తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న పనులని వాటికి నిదర్శనలే ఇవి అని అన్నారు.


వినుకొండ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటున్నారని, వారి మధ్య ఎలాగైనా గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు సమన్వయంతో ఉండాలని, ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ వారు రెచ్చగొట్టే విధంగా వారి వైఖరి ఉంటే, మీరు ఎక్కడా కూడా గొడవలకు పోవద్దని, కార్యకర్తలు అందరూ సహానం పాటించాలని కోరారు.