కానీ ఇది అసత్య ఆరోపణలు అని అన్నారు. అక్కడ ఏ డోర్ నంబర్ తో ఎన్ని ఉన్నాయన్నది మీడియా వారి సమక్షంలో అక్కడికి వెళ్లి పరిశీలించి ఓటర్ లిస్ట్ లో ఈ డోర్ నంబరుతో ఎన్ని ఉన్నాయన్నది విపులంగా వివరించారు.. వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా లేకనే ఎలక్షన్ కమీషన్ మాట్లాడి ఎన్నకలనే అపెంచేస్తానని చంద్రబాబునాయుడు దత్త పుత్రుడు అయినా విష్ణు కుమార్ రాజు దుస్పప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీకే భవిష్యత్తు గ్యారంటీ లేదని అన్నారు. జనసేన పార్టీ వారహి యాత్ర కూడా లేదని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అద్భుతమని దేశంలో ఎక్కడా చేయలేని విధంగా ముఖ్యమంత్రి ఈ మంచి కార్యక్రమం చేపట్టడం ఒక చరిత్ర అన్నారు. విష్ణు కుమార్ రాజు గతంలో ఫ్లోర్ లీడర్ గా ఐదు సంవత్సరాలు ఉండి ఏమీ అభివృద్ధి చేసారో చెప్పాలని సవాలు విసిరారు. విష్ణు కుమార్ రాజు బిజెపి కండువా వేసుకుని చంద్రబాబు నాయుడు చెప్పిందే మాట్లాడుతున్నాడని అన్నారు. గంటా శ్రీనివాసరావు సీటు ఎక్కడో ఆయనకే తెలియదని అన్నారు.
సంక్షేమం అందటం లేదు చర్చకు సిద్దం అనడం శోచనీయమన్నారారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకి పాఠశాలల్లో టాయిలెట్ లు కూడా లేని పరిస్థితి ఉండేదని ఇప్పుడు అంతర్జాతీయ ప్రామాణాలతో అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఉత్తర నియోజకవర్గంలో స్కూల్ అభివృద్ధి ఎలా చేశామో, అభివృద్ధి, సంక్షేమం చర్చకు రావాలని సవాలు విసిరారు. విద్యశాఖ అభివ్రుద్ది ముఖ్యమంత్రి ఎంత బడ్జెట్ పెట్టారు. టీడీపీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారు చర్చకు సిద్దమా అన్నారు. సంక్షేమం గురించి మాట్లాడే అర్హత టీడీపీలో ఎవ్వరికి లేదన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, పార్టీ మండల అధ్యక్షులు కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్, పార్టీ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనుక్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ మండల అధ్యక్షులు అల్లు శంకరరావు, కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు, కె.వి.యన్ శశికళ, కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, మహిళ విభాగం జోనల్ ఇంచార్జ్ పీలా వెంకటలక్ష్మీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు, JCS మండల కన్వీనర్ నీలి రవి, బులుసు జగదీశ్, అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.