రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నందున 2014 తర్వాత లబ్ది పొందని, అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతున్నాము. ఇళ్ల స్థలాలకు జర్నలిస్ట్ తరుపున 40శాతం వాట చెల్లించాలని ఇచ్చిన నిబంధన వారికీ భారంగా ఉంటుంది. నిబంధనలలో పేర్కొన్న అన్ని అంశాలలో జర్నలిస్ట్ లకు గాని, జర్నలిస్ట్ భార్యకు గాని ఇళ్ళు లేదా ఇంటి స్థలం ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలానికి అర్హులు కాదని జీవో లో పేర్కొన్నారు.
దీని వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు న్యాయం జరిగే అవకాశం లేదు. జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి దృష్యా 60:40 ప్రాతిపదికగా రూపొందించిన నిబంధనలను అందరికి అనువుగా 90:10 నిష్పతిలో చెల్లించేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఇళ్ల స్థలాలు కూడా నివాస యోగ్యమైన ప్రదేశాలల్లో కేటాయించాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 నిబంధన అమలులో ఉన్నందున అక్కడ ఉన్న జర్నలిస్టులకు దగ్గరలో ఉన్న మైదాన ప్రాంతాలల్లో ఇళ్ళు కేటాయించాలని కోరారు.
ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టుల అర్హతలకు సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ, నిర్వచనం ప్రకారం అర్హులను ఎంపిక చేసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల స్థలాలకు జీవో నెంబర్ కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ స్టేట్ కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకట్రావు కోరినట్లు తెలిపారు.