ఏలూరు జిల్లా, చింతలపూడి: ఈజీ గా డబ్బు సంపాదించటం కోసం యువత తప్పుడు మార్గాలను ఎన్నుకుంటున్నారు. దొంగతనాలు, మోటార్ సైకిళ్ళు దొంగిలించడం, గంజాయి అమ్మటం లాంటివి కొన్ని అయితే ఈ యువకుడు వినూత్నంగా ఆలోచించి డైరెక్ట్ గా పోలీస్ అవతారమెత్తారు. మండలంలోని ఏర్రగుంటపల్లికి చెందిన రాచప్రొలు నవీన్ అనే యువకుడు కొంతమంది వ్యాపారుస్తులకు ఫోన్ చేసి నేను కానిస్టేబుల్ నని (చింతలపూడి స్టేషన్ లోని ఒక్కొకసారి ఒక్కో కానిస్టేబుల్ పేరు చెపుతూ) డబ్బులు కావాలని బెదిరిస్తూ ఇవ్వను అన్న వారిని నీ పని చూస్తాను అంటూ బెదిరిస్తూ డబ్బు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే విధంగా ఈ రోజు ఒక వ్యాపారిని రూ.1000/- అడిగి తీసుకుని మళ్ళీ వెంటనే మరో 1000 రూపాయలు కావాలని అడగటంతో అనుమానం వచ్చిన ఆ వ్యాపారి పోలీసు వారికి సమాచారం ఇవ్వటంతో చింతలపూడి SI ప్రసాద్ వలపన్ని నవీన్ ను అరెస్ట్ చేసి నవీన్ ను రిమాండ్ కు పంపుతున్నట్లు CI MVS మల్లేశ్వరరావు ప్రెస్ మీట్ లో తెలిపారు.
T. బాలస్వామి, రిపోర్టర్.