ఏలూరు జిల్లా, కుక్కునూరు/ఏలూరు: కుక్కునూరు మండలంలో ఆదివారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు. మంచినీటి బోర్లు పనితీరుని పరిశీలించారు. వైద్య శిబిరాలలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. దాచారం గ్రామంలో వరద ముంపు గ్రామాలలోని ప్రజలను పూర్తిగా ఆదుకుంటామన్నారు. త్రాగునీటికి ఎటువంటి కొరత లేకుండా మంచినీటి బోర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పోరు నీటిని వినియోగించుకోవాలన్నారు.
వరద సమయంలో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య సేవలు అందించేందుకు గాను మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ వైద్య శిబిరాల వద్ద 20 రోజులకు సరిపడా మందులు నిల్వ ఉంటాయని, ముఖ్యంగా పాముకాటు నివారణకు మందులు సిద్ధం చేయడం జరిగిందన్నారు. కుక్కునూరు మండలం దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటుచేసిన వరద పునరావాస కేంద్రంలో మంచినీటి బోర్లా పనితీరును పరిశీలించారు.
అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య శిబిరం వద్ద ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. మందుల నిల్వలను కూడా సత్యనారాయణ పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వైద్య సేవలను అందించడానికి 108 వాహనములు సిద్ధం చేశామని తెలిపారు. వైద్య శిబిరాలలో టైఫాయిడ్, మలేరియా, డెంగు అత్యవసర మందులు కూడా శిబిరాల్లో ఉంచామన్నారు. వరద ముంపు ప్రాంతాలలో ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పంచాయతీ రాజ్, తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.