ఇసుక ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు, ఇసుక దోపిడి అరికడతాను. యువతా... మీ కోసం నేను చెమట చిందిస్తున్నాను, అర్దం చేసుకోండి. ప్రజలకు ఆంధ్రా అనే భావన ప్రజల్లో రావాలి, రాష్ట్రం కోసం ఆలోచించండి. వంద మంది కష్టాన్ని 30 మందికి పంచుతున్నాడు..వైసీసీ ఉప్మా ప్రభుత్వం. రాష్ట్రంలోని 75 శాతం మంది వైసీపీపై అయిష్టంగా ఉన్నారు. ఆ 75 శాతం మంది ఏకాభిప్రాయానికి వచ్చి, అనైక్యతను జయించాలని పిలుపు ఇచ్చారు.
ఉమ్మడి కార్యాచరణను అర్థం చేసుకోవాలి.. నా దగ్గర వేల కోట్లు లేవు, సుఫారీ గ్యాంగుల్లేవు, క్రిమినల్స్ లేరు'' అంటూ వైసీపీ ప్రభుత్వంపై కీలక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ''కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడం నాకు అభ్యంతరం లేదు. కానీ జనం ఏమనుకుంటున్నారో కూడా ప్రభుత్వం తెలుసుకోవాలి.
ఇక్కడ పండించిన ప్రతి బస్తా ద్వారంపూడి కుటుంబానికి వెళుతోంది.. నేను వైసీపీకి వ్యతిరేకం కాదు.. రైతు కన్నీరు తుడుస్తానంటే.. నేను చప్పట్టు కొడతా తప్ప వ్యతిరేకించను.. కానీ లక్షల మంది రైతులు కన్నీరు పెడుతున్నారు. కోనసీమ రైతుల కన్నీటి మీద సంపాదించుకుంటోంది ద్వారంపూడి కుటుంబం. "ఒక కులమే… రెండు కులాలే మొత్తం ఆర్థిక వ్యవస్థని చేతిలో పెట్టుకోవాలంటే కుదరదు. అందరూ పైకి రావాలి'' అని పేర్కొన్నారు.