చింతలపూడి: పట్టణం ప్రపంచ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతలపూడి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి C మధు బాబు గారు పట్టణ పోలీస్ లు, ఎక్సైజ్ పోలీస్ లతో ఏర్పాటు చేసిన ర్యాలీ లో మాదక ద్రవ్యాలు సేవించుట వలన వచ్చు దుషపరిణామాలు గురించి, ప్రెసెంట్ పిల్లలు కాలేజీ స్థాయి నుండి మాదక ద్రవ్యాలు సేవిస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, మరి ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాల పిల్లలు, మెడికో స్టూడెంట్స్ డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని, ప్రతి కళాశాలలో anti డ్రగ్స్ కమిటీ లు యేర్పాటు చేసి పిల్లల భవిష్యత్ కాపాడాలని, అలాగే పిల్లల ప్రవర్తనలపై తల్లితండ్రుల పర్యవేక్షణ అవసరమని తెలుపుతూ, సమాజంలో గంజాయి పందించుట దానిని అక్రమ రవాణా చేయుట నేరమని దానికి కటినమైన శిక్షలు వున్నాయని, ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న భూతం గంజాయి అని ప్రతి ఒక్కరూ దాని నిర్మూలనలో సహకరించాలని, "గంజాయి లో లేదు ఎంజాయ్ ఆరోగ్య సమాజమే హాయి అనే స్లోగన్, ఆరోగ్యమే మహాభాగ్యం మత్తు పదార్థాల వాడకం ఒక రోగం అనే స్లోగన్ ద్వారా చింతలపూడి పట్టణ వాసులను మెల్కొలిపారు ఇందులో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ MVS మల్లేశ్వర రావు, SI D. హరి కృష్ణ, సిబ్బంది, ఎక్సైజ్ ఇనస్పెక్టర్ సుంకర సాయి స్వరూప్ మరియు సిబ్బంది, న్యాయవాదులు డేవిడ్ రాజు, విజయ రావు, LV చైతన్య, రంజిత్ కుమార్, అప్పయ్య, పార లీగల్ వాలంటీర్స్ ఎండీ అక్బర్ అలీ, నండిపాము యేసు రత్నం, మరియు సచివాలయం మహిళ పోలీసులు, అంగన్వాడి టీచర్స్ మరియు పట్టణ వాసులు పాల్గొన్నారు.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.BCN OTT