ఈ రోజు శ్రీస్వామివారి ఆలయమునకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జడ్జ్ వి. గోపాల కృష్ణరావు వారి దంపతులు విచ్చేయగా వారికి ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. తదుపరి శ్రీ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదములు అందచేసినారు.
ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం జుడిషల్ మేజిస్ట్రేట్ కె. రాజరాజేశ్వరి, జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జ్ సి.హెచ్ కిషోర్ కుమార్, జంగారెడ్డిగూడెం RDO యమ్.ఝాన్సీ రాణి, జంగారెడ్డిగూడెం MRO కె.స్లీవా జోజి, లక్కవరం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పర్యవేక్షించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరిత విజయభాస్కర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.