Hot Posts

6/recent/ticker-posts

ఆగిరిపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సుడిగాలి పర్యటన

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి : మండలం వడ్లమాను గ్రామంలో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు లేఅవుట్ లో నిర్మిస్తున్న ఇళ్లను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్  నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోని ఇళ్లను మాత్రమే నిర్మించాలని, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. నివాసాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని కలెక్టర్ ను స్థానిక ప్రజలు కోరగా అర్జీ అందజేయమని, చర్యలు చేపడతామని  తెలిపారు.


అనంతరం ఆగిరిపల్లిలో ఉన్న కోనేరులోని ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టిన మట్టి పనులను పరిశీలించారు. కోనేరు చుట్టూ మొక్కలు నాటి లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అడవినెక్కలంలో సుమారు 5 ఎకరాల్లో ఉన్న  క్రీడ మైదానాన్ని కలెక్టర్ పరిశీలించారు. క్రీడ మైదానానికి చుట్టుపక్కల ఉన్న భూమిని గురించి అడిగి తెలుసుకున్నారు. అక్రమ మైనింగ్ కు చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ కు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అదే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. క్లాస్ రూమ్ లో విద్యాబోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వి సి ఆర్ గదికి వెళ్లి పరిశీలించారు. పాఠశాలలో ఆరో తరగతిలో జాయిన్ అవ్వడానికి వచ్చిన విద్యార్థిని తల్లితో మాట్లాడుతూ పాపని మంచిగా చదివించాలని, మంచి జీవితాన్ని అందించాలని అన్నారు. 

 

అలాగే విద్యార్థినితో క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. త్రాగునీరు, మధ్యాహ్న భోజన పథకం, ఆణిముత్యాలు కార్యక్రమం గురించి ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ ని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలు నాటాలని, ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి ఉపాధ్యాయులు పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.


ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి పి వెంకటరత్నం, తాసిల్దార్ ఉదయభాస్కర్, ఎంపీడీవో పి. శంకర్రావు, ఇఓపిఆర్డి ప్రసాద్, ఏపీవో మీనాక్షి, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.

BCN OTT
app Download link 
BCN TV LIVE link 

SANA TV LIVE link 
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి.
ELURU FM (All songs)
app DOWNLOAD link