Hot Posts

6/recent/ticker-posts

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్..


ఏలూరు జిల్లా ఏలూరు: జిల్లాలో భూమి రీ సర్వే పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరు ప్రసన్న వెంకటేష్ కలెక్టరేట్లోని గౌతమి సమావేశం మందిరం నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి కలసి సబ్ కలెక్టర్, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తాసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.


ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని  నిర్దేశించిన గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. భూ రీ సర్వే పనులు వేగవంతం చెయ్యాలని, పూర్తిచేసిన భూ రీసర్వే వాటికి గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించిన వాటిపై, కొల్లేరు రీ సర్వే , టవర్స్ ఏర్పాట్లపై గుర్తించిన ల్యాండ్ పై, హౌసింగ్  వంద రోజులు టార్గెట్ ను కొంతమంది పూర్తి చేశారని కొంతమంది పూర్తి చేయలేదని దీని గల కారణాలపై, హైకోర్టుకు సంబంధించిన ప్రభుత్వ శాఖల కేసులు, ఏఎన్ఎంల ఫీడ్ బ్యాక్, ఎన్సీడీ సర్వే గురించి, ముఖ ఆధారిత హాజరు అమలు గురించి, జిల్లాలోని కంటి వెలుగు క్రింద ఆపరేషన్ నివేదిక, మహాప్రస్థానం వాహనం రవాణానివేదిక, స్కూలు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన రక్తహీనత, రక్తహీనతను తగ్గించడానికి చేపట్టవలసిన చర్యలపై, జిల్లాలో ఆణిముత్యాలు, విద్యా కానుక నివేదిక, జీజీఎంపి వైయస్సార్ భీమా పథకం, జగనన్నకు చెబుదాం అంశాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్షించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.  సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏ వి  ఎన్ ఎస్ మూర్తి, ఏడి సర్వే వెంకటేశ్వరరావు, హౌసింగ్ పిడి నరసింహారావు, డిఆర్డిఎ పిడి విజయరాజు, డి ఎం హెచ్ వో డాక్టర్ ఆశా, ఐసిడిఎస్ పిడి పద్మావతి ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.