Hot Posts

6/recent/ticker-posts

రాష్ట్రవ్యాప్తంగా 'హమ్ సబ్ జగన్ కే సాత్' అంటున్న మైనారిటీలు


ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగేళ్ల పాలనలో మైనారిటీలకు వైఎస్ జగన్ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మసీదుల వద్దకు వెళ్లి నిర్వహిస్తున్న 'హర్ దిల్ మే వైఎస్ఆర్- హమ్ సబ్ జగన్ కే సాత్' కార్యక్రమాన్ని మైనారిటీలు గొప్పగా ఆదరిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు షేక్ గౌస్ మొహిద్దిన్ అన్నారు. హర్ దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమం అన్ని జిల్లాలలో విజయవంతంగా నడుస్తున్న సందర్భంలో ఈరోజు విజయవాడ లోని ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు షేక్ గౌస్ మొహిద్దిన్ కార్యాలయంలో వివిధ జిల్లాల వక్ఫ్ బోర్డు అధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మైనారిటీలకు పెద్ద పీట వేస్తూ వైఎస్ జగన్ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు మద్దతు పలుకుతున్నారని అన్నారు.


ఈ సమావేశంలో అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఖాగజ్ ఘర్ రిజ్వాన్,అమలాపురం జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఖాదర్, ఏలూరు జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు డా. జమా,తూర్పు గోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఎండి ఆరిఫ్, కాకినాడ జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు రెహ్మాన్ ఖాన్, కర్నూల్ జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు నియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.