Hot Posts

6/recent/ticker-posts

యోగా అభ్యాసన ద్వారా మానసిక రుగ్మతలు తొలగించకోవచ్చు: జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్


ఏలూరు జిల్లా, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  చైర్మన్ సి.పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో  బుధవారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ప్రజా జీవనము యాంత్రికమైనదని ఈ సందర్భంలో ప్రతి వ్యక్తికి మానసిక మరియు మనోవికాసము తప్పనిసరిగా కావాలని అందువల్ల ప్రతి ఒక్కరూ నిత్యం యోగా మరియు ధ్యానమును అభ్యసించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఒత్తిడిని జయించడానికి యోగా కీలకమైందని తెలిపారు. యోగా ద్వారా,మానసిక రుగ్మతలను దూరం చేయడానికి, శారీరక దృఢత్వాన్ని పొందడానికి యోగ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. యోగా శిక్షకులు వేదుళ్ళ రాంబాబు న్యాయమూర్తులు న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బందికి యోగ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి జి. రామగోపాల్ మరియు న్యాయమూర్తులు, ఏలూరు బారు అసోసియేషన్ ప్రెసిడెంట్ అభినేని విజయ్ కుమార్ ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.