ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం: పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న శ్రీనూకాలమ్మ అమ్మ వారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుండి భక్తులు భారీ సంఖ్యలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలలో మరియు అభిషేకము, విశేష హారతి పూజలలో పాల్గొన్నారు.
ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మ వారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాదవితరణ మరియు ఆలయ అభివృద్ధికి గుబ్బల చంద్రరావు అనంతలక్ష్మి (రాజమహేంద్రవరం) దంపతుల కుమారుడు గుబ్బల ప్రసాద్ రామలక్ష్మి కుటుంబ సభ్యులు రూ 25,116లు విరాళంగా అందజేశారని, వారినీ వారి కుటుంబాలను, వ్యవసాయ వ్యాపార, ఉద్యోగాలను అమ్మ వారు ఎల్లవేళలా కాచి కాపాడాలని అమ్మ వారిని కోరారు. అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మ వారి శేష వస్త్రన్ని, చిత్ర పటాన్ని ఇచ్చి వేద ఆశీర్వాదంతో ఘనంగా సత్కరించారు. అమ్మ వారి ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను ప్రత్యేకంగా అభినందించారు.
ది.2.7.23 ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆలయ ఆవరణలో ఉన్న యాగశాల నందు లోక క్షేమార్థం 52వ చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా జరుగుతుందనీ, పాల్గొన దలచిన భక్తులు కమిటీ వారిని సంప్రదించి, పేర్లు నమోదు చేసుకొని, చండీహోమంలో పాల్గొని అమ్మ వారిని దర్శించి, తీర్ధప్రసాదాలు స్వీకరించి, అమ్మ వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనోజ్ శర్మ కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు,మహిళలు, వ్యాపారస్తులు రైతులు ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, శ్రీనూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రసాద వితరణ చేశారు.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.