Hot Posts

6/recent/ticker-posts

అటు వైసిపి...ఇటు జనసేన... కాకినాడలో హోరా హోరి మాటల యుద్ధం..!

కాకినాడ సిటీ నియోజకవర్గంలో పవన్ యాత్రతో రాజకీయ నేతల్లో హోరా హోరి మాటల యుద్ధం మొదలైంది. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో వారాహి యాత్ర చేస్తూ సర్పవరం గ్రామం జంక్షన్ లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చేసిన మాటలు పెద్ద యుద్ధానికి దారితీసింది. ఆయన్ని రాజకీయంగా ఓడించకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని జనసేన నేత పవన్ కళ్యాణ్ బహిరంగాఅతి పెద్ద సవాల్ చేశారు. దానికి ప్రతిఘటించిన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ జనసేన నేత పవన్ కళ్యాణ్ కి తిరిగి చాలెంజ్ చేశారు. తనను ఓడించడానికి వారూ వీరూ ఎందుకూ పవనే నేరుగా తనతో నువ్వే పోటీకి దిగాలని, కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తే విజేత నువ్వా నేనా అనేది జనాలే నిర్ణయిస్తారని సవాల్ చేశారు.


అదే సవాల్ ను ఆ మరుసటి రోజు కూడా వేశారు. కాకినాడ వదిలి వెళ్తున్న పవన్ తన సవాల్ ని స్వీకరించలేదని ద్వారంపూడి విమర్శించారు. తన మీద పోటీకి పవన్ రావాలంటే చంద్రబాబు నుంచి అనుమతి రావాల్సి ఉందని కూడా ఎద్దేవా చేశారు. దీనిపై జనసేన కాకినాడ నేతల నుంచి ద్వారంపూడికి ఘాటైన సమాధానం వచ్చింది. కాకినాడ సిటీ నుంచి ముత్తా శశిధర్ పోటీ చేస్తారని వైసీపీ నుంచి ఏకంగా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోటీకి దిగాలని ప్రతి సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే జనసేన సత్తా చాటుకుంటామని వారు సవాల్ వేశారు.


ద్వారంపూడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే.. ముత్తా శశిధర్ కి పోటీ చేయడానికి సరితూగరా అని ఒక ప్రశ్నగా మిగిలింది. అదేకాదు వైసీపీలో కొన్నాళ్ళు ఉన్న ముత్తా శశిధర్ ఏకంగా జగన్నే ఓడించే స్ధాయా అని వైసీపీ నేతలు అంటున్నారు.


ద్వారంపూడి అవినీతిపరుడు అని, ఇక ఆయనకు రాజకీయ జీవితం సమాప్తం అని జనసేన నేత పవన్ అన్నారు కాబట్టే ఎమ్మెల్యే సవాల్ చేశారని మధ్యలో జగన్ ప్రస్తావన ఎందుకు అని కొందరు అంటున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పోటీకి రావాలని కోరితే జనసేన నేతలు జగన్ అంటున్నారు. మొత్తానికి చూస్తే కాకినాడ సిటీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి జగన్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా ఢీ కొంటారా అన్నదే చర్చగా మారింది. జగన్ ఎపుడూ పులివెందుల నుంచే పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఏంటో ఇంకా తేలలేదు అని హేళనగా మాట్లాడారు. ఈ నేపధ్యంలో పవన్ గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తే కాకినాడ సిటీని ఎంచుకోవాలని ద్వారంపూడి సవాల్ చేస్తున్నారు.


ఏది ఏమైనా కాకినాడ రాజకీయాలు మాత్రం ఈ సవాళ్ళూ ప్రతి సవాళ్ళతో మంచి కాక మీద ఉన్నాయని పలువురు అంటున్నారు. నిజంగా పవన్ జగన్ పోటీకి దిగితే ఆ కధ వేరే స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఏదిఏమైనా జనసేన వారాహి యాత్రలో పవన్ వేసిన సవాల్ ఇరువర్గాలలో హోరా హోరి మాటల యుద్ధం..! జరిగింది.

 

ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.

BCN OTT
app Download link 
BCN TV LIVE link 

SANA TV LIVE link 
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి.
ELURU FM (All songs)
app DOWNLOAD link