తాజా వార్తలు

10/recent/ticker-posts

భీమడోలు శాఖ గ్రంథాలయంలో అల్లూరి వర్ధంతి నిర్వహణ


యువతకు ధైర్యం, త్యాగానికి ప్రతీక అల్లూరి: వక్తలు


భీమడోలు, పశ్చిమ వాహిని, మే 8: మన్యవీరుడు Alluri Sitarama Raju నేటి యువతకు ధైర్యం, త్యాగానికి ప్రతీకగా నిలుస్తారని పలువురు వక్తలు పేర్కొన్నారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణా తరగతుల తొమ్మిదో రోజు కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.

గ్రంథపాలకుడు కె. శ్రీనివాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు టీవీ ఉమామహేశ్వరరావు, మండే సుధాకర్, కాపాక సతీష్ తదితరులు చిన్నారులకు నీతి కథలు, పుస్తక సమీక్షలు, గణిత మెలకువలు వివరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేస్తూ చిన్నారుల్లో అవగాహన కల్పించారు.

అనంతరం అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. “జోహార్ అల్లూరి” అంటూ చిన్నారులు, పాల్గొన్నవారు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పోరాట స్ఫూర్తి, ధైర్యం, త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే మహనీయుల సేవలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.

కార్యక్రమం అనంతరం సుమారు 40 మంది చిన్నారులు వివిధ ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తాటిమళ్ల రామ్మూర్తి, తవ్వా చిన్నబాబు, కృష్ణవేణి, మాదిరి కళాశాల ప్రిన్సిపాల్ బాలు తదితరులు పాల్గొన్నారు.