తాజా వార్తలు

10/recent/ticker-posts

నూతన దంపతులను ఆశీర్వదించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్


దెందులూరు, గన్నవరంలో వివాహ వేడుకలకు హాజరు – హనుమాన్ జంక్షన్‌లో ప్రత్యేక పూజలు


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 8: ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ శుక్రవారం దెందులూరు నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతల కుటుంబాల్లో జరిగిన శుభకార్యాలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ముందుగా దెందులూరు మండలం చల్లచింతలపూడిలో పార్టీ నాయకుడు నాగనబోయిన సత్యనారాయణ, చంద్రావతి దంపతుల కుమార్తె ప్రసన్న కుమారి వివాహ వేడుకకు హాజరైన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వధువరులను ఆశీర్వదించి “మహేష్ అన్న పెళ్లి కానుక” అందజేశారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం గన్నవరంలో నిర్వహించిన ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి కుమార్తె గీతిక వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అక్కడ కూడా “మహేష్ అన్న పెళ్లి కానుక” అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

గన్నవరం ప్రయాణంలో భాగంగా మార్గమధ్యంలోని హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించిన ఎంపీ, హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు కోరారు.

ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి చైర్మన్, ఈవో మరియు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఎంపీకి ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.