ప్రజల ఆరోగ్యం పరిరక్షణే లక్ష్యంగా ....
దిగ్విజయంగా వైద్యయజ్ఞం ....
జిల్లాలో ఇంటింటికీ వైద్యసేవలు
ఇప్పటి వరకూ 10,84,722 మంది ఆరోగ్య వివరాల సర్వే
ఇంతవరకు 63,226 ఓపి నమోదు
127 రకాల ఔషధాలు ఉచితంగా పంపిణీ
ప్రతి ఇంటి తలుపు తట్టి అందరికీ ఆరోగ్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం తో ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఏలూరు జిల్లాలో విశేష స్పందన లభిస్తోందనీ డి యం హెచ్ వో డా.ఎస్.శర్మిష్ట తెలిపారు.జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ నేతృత్వంలో పటిష్ఠమైన కార్యాచరణతో అత్యంత సమర్థవంతంగా జె కె సి కార్యక్రమం ముందుకు సాగుతుంది.జిల్లాలోని ప్రజా ప్రతినిధుల సహకారం,వివిధ శాఖల సమన్వయoతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం గా నిర్వహించబడుతుందన్నారు.
ఇప్పటి వరకూ జిల్లాలో ఆశా వర్కర్లు, ఏఎసీఎంలు ఇతర ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇంతవరకు 10,84,722 మందిని సర్వే చేశారు. వారికి 1663514 రక్త పరీక్షలు నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ఇంతవరకు గ్రామీణ ప్రాంతాలలో 153, పట్టణ ప్రాంతాలలో 8 కలిపి మొత్తం 161 శిబిరాలు నిర్వ హించారు.
ఈ శిబిరాలలో ఇంతవరకు 63,226 మందిని పరీక్షించగా అందులో 854 మందిని వివిధ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేశారు. మరో 5,110 మందికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో 127 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలరోజులకు సరిపడా ఔషధాలు ఇస్తున్నారు.
ఒక్కో పిహెచ్ సి పరిధిలో నాలుగు శిబిరాలు!
అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తోంది. అర్బన్ పరిధిలో ఒక్కో యూపీహెచ్ సి పరిధిలో ఒక్కో శిబిరం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి వస్తున్న స్పందనచూసిన తర్వాత ఒక్కో పీహెచ్ సి పరిధిలో మూడునుంచి నాలుగు శిబిరాలు పెట్టాలని నిర్ణయించారు. ఈ ఆరోగ్య శిబిరాల్లో కంటి వైద్యం కోసం వస్తున్నవారి సంఖ్య కూడా గణనీయంగా ఉండటంతో ప్రతివైద్య శిబిరంలోనూ నేత్ర వైద్యుడి సేవలను తప్పనిసరి చేశారు. వైద్య సేవల్లో ఎటువంటి లోటు రాకుండా ఉండేందుకు ప్రతి శిబిరాన్ని వైద్య సిబ్బందితో పాటు మండల అధికారులు, ఒకస్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షించాలా ఏర్పాటు చేశారు.
జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల నిర్వహణ కోసం గ్రామీణ ప్రాంతాలలో ఒక్కో శిబిరానికి రూ.30 వేలు, అర్బన్ ప్రాంతాలలో రూ.60 వేలు ప్రభుత్వం మంజూరు చేసింది.
జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో పది డస్క్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి హెల్ప్ డస్క్ కాగా, రెండోది రిజిస్ట్రేషన్ డస్క్ ఎంబీబీఎస్ వైద్యులు, స్పెషలిస్టులు, నేత్ర వైద్యులు, పరీక్షలు, మందులు, సర్వేలో పాల్గొనని వారికి బీపీ, షుగర్ చెక్ చేసేందుకు వేర్వేరు డస్క్ లను ఏర్పాటు చేశారు.
వైద్యుల సంఖ్యః ఓపిః 63,226
వైద్యాధికారులు: 120
గైనకాలజిస్టులు: 28
జనరల్ మెడిసిన్ :19
పీడియాట్రిక్స్:18
ఆర్థోపెడిక్స్ :32
జనరల్ సర్జరీ :16
సైకియాట్రీ:9
నేత్రవైద్యులు సర్జరీ :24
ఈ ఎన్ టి:11
చర్మ వైద్య నిపుణులు:12
పల్నొమ్నోలజీ:7
కమ్యూనిటీ మెడిసిన్:5
డెంటిస్ట్:01
రెస్పిరేటరీ మెడిసిన్:01