తాజా వార్తలు

10/recent/ticker-posts

నాగులచెరువులో వాటర్ ట్యాంక్ ప్రారంభం – ఇంటింటికీ తాగునీటి కుళాయి పథకానికి శ్రీకారం


కపిలేశ్వరపురం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: కపిలేశ్వరపురం మండలం నాగులచెరువు గ్రామంలో జల జీవన్ మిషన్ పథకం కింద నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను గురువారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రారంభించారు. తొడుగుడ్లపాడు ప్రాంతంలో రూ.14.48 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ నీటి సదుపాయం గ్రామ ప్రజలకు ఉపయోగపడనుంది. అదే సమయంలో ఇంటింటికీ మంచినీటి కుళాయి పథకాన్ని కూడా ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, ఈ పథకం ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

గ్రామ ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, నీటిని సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో నీటి సమస్యలు పూర్తిగా తొలగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు, మాజీ సర్పంచ్ వాసంశెట్టి సత్యనారాయణ, గుత్తుల రామకృష్ణ, వాసంశెట్టి శ్రీనివాస్, గంజా ఆనందరావు, మేడిశెట్టి సత్యనారాయణ, చింతపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.