తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రభుత్వ నిబంధనలు ఊళ్ళంగిస్తున్న శర్వణ కళాశాల విద్యాసంస్థ పై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివ కుమార్


-శర్వణ కళాశాల హాస్టల్ విద్యార్థుల జీవితాలను కాపాడండి...

-జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం విడిచి పెట్టి ప్రవేట్ విద్యాసంస్థల పై కఠిన చర్యలు తీసుకోవాలి...


ఏలూరు, పశ్చిమ వాహిని మార్చి 27: స్థానికంగా ఉన్నటువంటి శర్వణ కళాశాల విద్యాసంస్థలో చదువుతున్నా విద్యార్థులకు ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తికాకుండానే సెకండ్ ఇయర్ తరగతులు నిర్వహిస్తు వేసవి సెలవులు ప్రకటించకుండా యాజమాన్యం తీరును ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివ కుమార్ విమర్శించారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి.శివ కుమార్ మాట్లాడుతూ.. శర్వణ కళాశాల హాస్టల్ విద్యార్థులను ఒక చీకటి గదిలో పెట్టి చిత్రహింసలు పెడుతూ మాకు విద్యార్థులు జీవితాలు ముఖ్యం కాదు మాకు ర్యాంకులే ముఖ్యమంటు విద్యార్థుల జీవితాలతో చావు చలగాటం ఆడుతున్న గాని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు.

రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడలేని విధంగా శరవణ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నరని అన్నారు. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మరియు విద్యార్థులందరు శ్రీరామ నవమి పండుగ జరుపుకుంటుంటే శర్వణ కళాశాల విద్యార్థులకు మాత్రం పండుగ అదృష్టం లేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ విషయం పై ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వాళ్లే విద్యార్థులందరు సమస్యలను ఎదురుకోవాల్సి పరిస్థులు నెలకుంటున్నాయనీ అన్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవలను తుంగలో తొక్కి శర్వణ విద్య సంస్థల యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో జిల్లా విద్యాశాఖ అధికారులు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ నాయకత్వం ఆందోళనకు స్వీకరం చూడతామని హెచ్చరించారు.