-రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు, భక్తులతో కళకళ లాడాన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-స్వామివారి దర్శనాలు సులభతరం చేసి, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి
-శ్రీ కోదండ రామాలయ ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహ పునఃప్రతిష్ఠ మరియు శ్రీఅభయ ఆంజనేయ వారి ఆలయంలో శిలా విగ్రహముల వాయు ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు/ఆగిరిపల్లి, మార్చి 25: ఆగిరిపల్లి మండలం సీతారామపురం గ్రామంలో బుధవారం శ్రీ కోదండ రామాలయం ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహా పునఃప్రతిష్ఠ, శ్రీఅభయ ఆంజనేయవారి ఆలయంలో శిలా విగ్రహములు వాయు ప్రతిష్ట మహోత్సవంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్యఅతిథిగా హాజరు అయ్యి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, వేద పండితులు, ఆలయ పాలకవర్గం సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ పండితులు స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను మంత్రికి అందజేసి, మంత్రికి వేద ఆశీర్వవచనాలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు మంత్రిని ఘనంగా సత్కరించారు. గోమాతలకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు, భక్తులతో కళకళలాడాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఆలయ అభివృద్ధికి, సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భక్తులు మనోభావాలకు అనుగుణంగా దైవదర్శనాలు, అన్ని సౌకర్యాలు కల్పించి, భక్తులు మన్ననలు పొందినప్పుడే పాలకవర్గంకు మంచి గుర్తింపు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం కలిసివస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, వివిధ శాఖలు అధికారులు, ఆలయ పాలకవర్గం సభ్యులు, కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ నాయకులు, ఎక్కువ సంఖ్యలో భక్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


