తాజా వార్తలు

10/recent/ticker-posts

ఉగాది సందర్భంగా ఏలూరు పోలీసులకు సేవా పతకాల వర్షం


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 18: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక *ఉత్తమ సేవా పతకాలు* మరియు *సేవా పతకాలు* ఏలూరు జిల్లా పోలీస్ శాఖకు చెందిన 10 మంది అధికారులు, సిబ్బందికి వరించాయి.


విధి నిర్వహణలో అంకితభావం, నైపుణ్యం ప్రదర్శించినందుకు ఈ గౌరవం దక్కడం పట్ల జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

పతకాలు అందుకున్నవారు:

👉 ఎన్. సూర్య చంద్రరావు, అదనపు ఎస్పీ (అడ్మిన్), ఏలూరు – సేవా పతకం
👉 ఎం. వెంకటేశ్వరరావు, డీఎస్పీ, ఎస్డీపీఓ పోలవరం – సేవా పతకం
👉 పిచ్చికల రవీంద్ర, ARSI-1524, DAR – ఉత్తమ సేవా పతకం
👉 వేగేశ్న వేణుగోపాల స్వామి, హెడ్ కానిస్టేబుల్-1911, స్పెషల్ బ్రాంచ్ – సేవా పతకం
👉 శానం రమేష్ కుమార్, AR హెడ్ కానిస్టేబుల్-1934, DAR – సేవా పతకం
👉 గుమ్మళ్ల శ్రీనివాసరావు, AR హెడ్ కానిస్టేబుల్-2762, DAR – సేవా పతకం
👉 ఎన్. గోపాలకృష్ణ, పోలీస్ కానిస్టేబుల్-960, దిశ పోలీస్ స్టేషన్ – సేవా పతకం
👉 ఎ. ఫణి కుమార్, పోలీస్ కానిస్టేబుల్-368, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ – సేవా పతకం
👉 మన్నెం సాయి శివ కుమార్, పోలీస్ కానిస్టేబుల్-2690, సైబర్ సెల్ – సేవా పతకం
👉 జి. నాగ శ్రీనివాసరావు, పోలీస్ కానిస్టేబుల్-2111, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ – సేవా పతకం

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖకు ఇంత పెద్ద సంఖ్యలో పతకాలు రావడం గర్వకారణమని తెలిపారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందికి ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు.

పతకాలు అందుకున్న ప్రతి అధికారి, సిబ్బంది తమ విధి నిర్వహణలో చూపిన అంకితభావం అభినందనీయం అని ఆయన తెలిపారు.