తాజా వార్తలు

10/recent/ticker-posts

పోలవరం ఆర్ & ఆర్ నిర్వాసితులకు రూ.250 కోట్లు విడుదల – ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హర్షం


పోలవరం, పశ్చిమవాహిని, మార్చి 18: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పోలవరం ప్రాజెక్ట్ ఆర్ & ఆర్ (పునరావాసం మరియు భూసేకరణ) నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేయడం అభినందనీయమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు.


బుధవారం మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పోలవరం ఆర్ & ఆర్ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని నిర్వాసితుల పట్ల ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పునరావాస కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

నిర్వాసితుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకొని, వారికి అవసరమైన సదుపాయాలు, ఆర్థిక సహాయం సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నిధుల విడుదలతో నిర్వాసితులకు పెద్ద ఎత్తున ఉపశమనం లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఎమ్మెల్యే మిరియాల శిరీష, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.