తాజా వార్తలు

10/recent/ticker-posts

కలపర్రు టోల్ గేట్ వద్ద హెల్మెట్ అవగాహన కార్యక్రమం – వాహనదారులకు పోలీసుల సూచనలు


కలపర్రు టోల్ గేట్, పశ్చిమవాహిని, మార్చి 16: రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు కలపర్రు టోల్ గేట్ వద్ద పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.


నూజివీడు డీఎస్పీ కె. వి. వి. ఎన్. వి. ప్రసాద్, పెదవేగి ఇన్‌స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్, పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి బైక్ రైడర్లకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించడం కాకుండా, వారితో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి భద్రతపై చైతన్యం కల్పించారు. ముఖ్యంగా హైవేపై హెల్మెట్ లేకుండా ప్రయాణించడం చాలా ప్రమాదకరమని, ప్రమాదాలు జరిగితే ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

అలాగే కారు డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

“మీ కోసం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యం వల్ల మీకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదం కలుగుతుంది. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలి” అని అధికారులు వాహనదారులకు సూచించారు.