ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 23: నగరంలో ‘ది క్రౌన్ ఆఫ్ ఏలూరు 2026’ జిల్లా, రాష్ట్ర స్థాయి ట్రెడిషనల్ ఫ్యాషన్ షో అందాల పోటీలు ఉల్లాసభరిత వాతావరణంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏలూరులోని కొత్త బస్టాండ్ ప్రాంగణంలో జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రెడ్డి అప్పల నాయుడు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఇలాంటి వినూత్న కార్యక్రమం ఏలూరులో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. యువతీ యువకులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా ఈ ఫ్యాషన్ షో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్ ఎండన ప్రియ, డైరెక్టర్ సతీష్ అడ్డాల లను అభినందించారు.
ఈ ఈవెంట్‌కు SRK బైక్స్ స్పాన్సర్‌గా వ్యవహరించారు.
నిర్వాహకులు ఎండానా ప్రియా, సతీష్ అడ్డాల మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ బృందం కృషి చేసిందని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డి అప్పల నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, కో-డైరెక్టర్లు, ‘క్రౌన్ ఆఫ్ ఏలూరు’ టీమ్ సభ్యులు, నగర ప్రముఖులు, స్పాన్సర్లు పాల్గొన్నారు.










