ఏలూరు జిల్లా : చింతలపూడి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం చింతలపూడి పట్టణం సుప్రియం పేటలో సుప్రియన్ పేట జగజ్జివన్ రావు యూత్, పెద్దలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం కేకు కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో సుప్రియన్ పేట గ్రామం నుండి పాత బస్టాండ్ ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నల్లంటి ఆస్కార్ విజయ మాదిగ, తనగాల మల్లయ్య, ముప్పిడి సామ్యూల్ మాదిగ, కోటమర్తి జయరాజు, తనాగాల సురేష్, హెచ్చు యోహాను, తనగాల మురళి మోనూరు తిరుపతిరావు, ఆతుకూరి సుబ్బారావు, ఎమ్మార్పీఎస్ చింతలపూడి మండలం అధ్యక్షులు మోనూరి మనోహర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు చవటపల్లి విజయ్ మాదిగ, యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.