తాజా వార్తలు

10/recent/ticker-posts

శెట్టిబలిజ కుల పితామహుడు దొమ్మేటి వెంకట్ రెడ్డికి ఘన నివాళులు


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, మార్చి 23: శెట్టిబలిజ కుల పితామహుడిగా పేరుపొందిన దొమ్మటి వెంకట్ రెడ్డి జయంతి వేడుకలు సోమవారం స్థానిక శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమం బతిని చిన్న ఆధ్వర్యంలో జరిగింది. నాయకులు మాట్లాడుతూ వెంకట్ రెడ్డి శెట్టిబలిజ కుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను ఎప్పటికీ మర్చిపోకూడదని, ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

వెంకట్ రెడ్డి బర్మా వెళ్లి వ్యాపారం చేసి, అక్కడ మేయర్‌గా ఎన్నికై ఐదేళ్లపాటు పదవిలో కొనసాగారని గుర్తు చేశారు. శెట్టిబలిజ సమాజాన్ని బర్మాకు తీసుకెళ్లి ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజులకు ప్రతిష్టాత్మక రాజ్యసభ స్థానం కల్పించడంలో ఆయన కృషి విశేషమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కుక్కల ధర్మ రాజు, గుబ్బల వెంకటేశ్వర్లు, లింగస్వామి, మురళీకృష్ణ, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.