ఏలూరు జిల్లా: నూతన శిక్షా స్మృతి చట్టాలపై పౌరులకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కీలక చర్యలు చేపడుతోంది. జిల్లా ఎస్పీ K Pratap Shiva Kishore, నూజివీడు డిఎస్పీ KVVN V Prasad ఆదేశాల మేరకు ఆగిరిపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు.
నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో, ఆగిరిపల్లి ఎస్ఐ శుభశేఖర్ మరియు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ ప్రధాన కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు, ప్రయాణికులకు నూతన చట్టాలపై వివరాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శుభశేఖర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు నూతన చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చట్టాల అమలులో పోలీసులకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
👉 చట్టాలపై అవగాహన కలిగి ఉండటం బాధ్యతాయుత పౌర లక్షణమని అధికారులు తెలిపారు.
ఏలూరు
Copyright (c) 2024 PASCHIMA VAHINI All Right Reseved