తాజా వార్తలు

10/recent/ticker-posts

విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులపై దాడి చేసిన అతోన్మాద ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గూండాలను తక్షణమే అరెస్టు చెయ్యాలి


ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివ కుమార్ డిమాండ్


ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 24: విద్యా కుసుమాలను వికసింపజేసే విశ్వవిద్యాలయాల్లో విద్వేష విషాన్ని చిమ్మేందుకు పరివార్‌ శక్తులు యత్నించడం దారుణం. విద్యాపరమైన శాస్త్ర, సాంకేతిక అంశాలతో మేధోమథనం జరగాల్సిన చోట  ఆర్ఎస్ఎస్‌కు చెందిన కొందరు మరియు  ఏబీవీపీ చెందిన కొందరు కలిసి విశాఖపట్నం ఎయులో ఒక పథకం ప్రకారం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుండగా, ఎఐఎస్ఎఫ్‌, ఎస్ఎఫ్ఐ, తదితర విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నాయి. 

ఇంత జరుగుతున్నా ఎయు వైస్‌ ఛాన్స్‌లర్‌, ఉన్నతాధికారులు మాటలకే పరిమితమయ్యారు తప్ప దాడులకు దిగిన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ , గూండాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అని " ఏఐఎస్ఎఫ్ " ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్ తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్న అరాచక శక్తులపై తక్షణమే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రప్రభుత్వం అయినా స్పందించాలన్నారు. లేకపోతే విశ్వవిద్యాలయాల్లో మత విద్వేష వ్యాప్తికి టిడిపి, జనసేన కూడా పాల్పడుతున్నాయని రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు.

దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాలయాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు పడుతున్నాయని, విద్యార్థులు సమస్యలు పరిష్కారం పై గొంతుకలు వినిపించేవారిపై నిర్బంధం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసమ్మతి, విమర్శతో సహా అర్థవంతమైన చర్చలకు కేంద్రాలుగా భాసిల్లవలసిన ఉన్నత విద్యా కేంద్రాలు నేడు మతతత్వ కార్యక్రమాలకు కేరాఫ్‌గా అడ్రస్ మారుతుండడం విచారకరం ఉంది అన్నారు.పాలక పక్షాల సిద్ధాంతాలు, భావజాలాలే దేశభక్తిపూరితమైనవిగా ప్రచారంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం, పరమత సహనం వంటి ఈ దేశ లక్షణాలను దెబ్బతీసేందుకు పరివార్‌ శక్తులు సాగిస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా ఐక్యమై తిప్పిగొట్టాలని పిలుపునిచ్చారు.