Hot Posts

6/recent/ticker-posts

పెన్సిల్ ఆర్ట్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి

తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి: దానవైపేట ఫస్ట్ ప్లస్ హాస్పిటల్ ఎదురుగా బాబీ ఆహ్వానం మేరకు పెన్సిల్ ఆర్ట్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ను రుడా చైర్పర్సన్ మేడపాటి

షర్మిళ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

గతంలో ఫ్లెక్సీలు, కంప్యూటర్, సెల్ ఫోన్ లో, డిజైనింగ్, లేని టైంలో చేతితో ఒక పేపర్ మీదైనా, గోడమైన, బోర్డు మీదైనా అందంగా బొమ్మల గీసి వాటికి రంగులు వేసి ప్రాణం ఉట్టిపడే విధంగా అప్పట్లో బొమ్మలు గీసేవారు. 


అలాగే ఇప్పుడు ఎంతో టెక్నాలజీ కంప్యూటర్ కాలంలో కూడా బాబి  పెన్సిల్ ఆర్ట్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి పిల్లలకు కేవలం రెండు నెలలు వ్యవధిలోనే సొంతంగా వాళ్ళ చేతులతో ఎంతో అందంగా బొమ్మలు గీయచడం అంటే మామూలు విషయం కాదని అన్నారు.

అలాగే రాజమండ్రి కళలకు పుట్టిల్లు లాంటిది అటువంటి రాజమండ్రిలో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా పిల్లలకు మంచి కళ నేర్పిస్తున్న బాబి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లలకు అన్ని విధాలుగా వెనకాడకుండా చదువుల్లోని వాళ్ళ టాలెంట్ ప్రతిభలోని  ముందుండి నడిపిస్తున్నారు మీ అందరిని త్వరలో వీలున్నంత వరకు జగనన్నకు ఈ పిల్లలు వేసే బొమ్మలను చూపిస్తానని చెప్పారు. మీరందరూ రానున్న రోజుల్లో మంచి ప్రతిభావంతులుగా అవ్వాలని అలాగే ఈ అకాడమీ ఇన్స్టిట్యూట్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.