గోకవరం మండలం: జి.కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. నిఖిత సమక్షంలో ఈస్ట్ గోదావరి జిల్లా స్క్రబ్ టైఫస్ నివారణ, నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా స్థాయి రాపిడ్ రెస్పాన్స్ టీమ్ (RRT) అయిన నిపుణులైన స్పెషలిస్ట్ వైద్యులు ఈరోజు గోకవరం మండలాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ప్రజలకు, గ్రామ పంచాయతీ రాజ్ విభాగం, వ్యవసాయ శాఖ, పశువైద్య శాఖ మరియు ఇతర శాఖల సిబ్బందికి స్క్రబ్ టైఫస్ పై అవగాహన కల్పించారు.
గోకవరం-1సచివాలయ పరిధిలో రమన్నాదొర వీధి నందు వైద్య సిబ్బంది చేయుచున్న ఫీవర్ సర్వేలెన్స్ తనిఖీ చేసి పరిసరాలు పరిశీలించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి కారణాలు, లక్షణాలు, ఎలా వ్యాప్తి చెందుతుంది, పారిశుభ్రతా చర్యలు, నివారణా చర్యలు, కీటకాల నియంత్రణ, వ్యాధి సంభవించినప్పుడు తక్షణ చికిత్స, గ్రామీణ ప్రాంతాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే విషయాలపై ప్రజలకు వివరణాత్మకంగా తెలియజేశారు.
అలాగే పంట పొలాల్లో పని చేసే రైతులు, గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు. పశువుల కొట్టాలు, చెత్త పేరుకుపోయే ప్రదేశాలు, మలిన నీటి నిల్వల వద్ద పరిశుభ్రత చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందిగా సూచించారు. మండలంలోని వివిధ సంబంధిత శాఖలతో కలిసి గ్రామాలలో వెక్టార్ కంట్రోల్ చర్యలు, ఐ.ఈ.సి కార్యక్రమాలు, ఫీవర్ సర్వేలు, ఆస్పత్రుల్లో నమూనాల సేకరణ, తక్షణ చికిత్స అందుబాటులో ఉంచడంవంటి చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో "ఆర్.ఆర్.టి" నిపుణుల బృందం స్పెషలిస్ట్ డాక్టర్ డా. దుర్గాప్రసాద్, ఎల్.ఎస్.ఎస్.టి.పి.శాస్త్రి, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా.రాజీవ్ హెల్త్ సూపర్ వైజర్స్ కె.సురేష్ బాబు, టి. శ్రీనివాస్, మాజీ ఎమ్.పి.టి.సి.సభ్యులు పులపర్తి బుజ్జి, స్థానిక వైద్యాధికారి నిఖిత, ఎమ్.ఎల్.హెచ్.పి రమ్య, ఏ.యెం.ఎమ్. వెంకట లక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ లు నాగేశ్వరావు, పవన్, రమణ, శ్రీను, మరియు పంచాయతీ రాజ్, (సచివాలయం)వ్యవసాయ, మరియు పశువైద్య శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

