ANDRAPRADESH: వివాదాస్పద ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యల తర్వాత.. రాజకీయంగా దళితులు-కాపుల వ్యవహారం ఆసక్తిగా మారింది. రాజకీయాల్లో ఇప్పటి వరకు పార్టీలు కలిసి పనిచేయడం తెలిసిందే. అయితే.. సామాజిక వర్గాలు చేతులు కలిపి పనిచేసిన ఘటనలు తక్కువ. పైగా.. బలైమన సామాజిక వర్గాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఏపీలో ఇతర సామాజిక వర్గాల కలయిక.. పెద్దగా ఫలించడం లేదు.
ఈ నేపథ్యంలోనే కొత్తగా పుట్టిన పార్టీలు విఫలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక, తాజాగా పీవీ సునీల్ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. దళితులు-కాపులు ఏకమైతే.. రాజ్యాధికారం వీరిదే అవుతుందన్నారు. ప్రస్తుతం దళిత జనాభాను తీసుకుంటే.. 2011 లెక్కల ప్రకారం 16.4 శాతం మంది ఉన్నారు. ఇక, కాపుల లెక్క చూస్తే.. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 శాతం మంది ఉన్నారు. ఈ సంఖ్య గత 10 సంవత్సరాల్లో పెరిగింది కూడా.

ఈ నేపథ్యంలోనే పీవీ సునీల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే ఎన్నికల నాటికి.. ఈ రెండు సామా జిక వర్గాలు చేతులు కలిపితే.. రాజ్యాధికారం సొంతం అవుతుందని సునీల్ చెబుతున్నారు. మరి నిజంగా నే కాపులు-దళితులు చేతులు కలిపే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉందా? అనేది ముఖ్యం. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కాపులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే.. వీరికి దళితులకు మధ్య గ్యాప్ ఉంది.
తూర్పులో జరిగిన రెండు ఘటనలు. ఈ రెండు సామాజిక వర్గాల మధ్య దూరాన్ని పెంచాయి. తరచుగా ఈ విషయాలు చర్చకు కూడా వస్తుంటాయి. అదేసమయంలో దళితుల్లోనే రెండు వర్గాలు ఉన్నాయి. ఒకదా ని పై ఒకటి ఆరోపణలు చేసుకోవడం తెలిసిందే. రిజర్వేషన్ల నుంచి రాజకీయా వరకు దళితుల్లోనే చీలిక లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఉభయ సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడం అనేది.. అంత తేలిక విషయం కాదు. ప్రయత్నిస్తే.. చేయొచ్చేమో!? అందుకే పీవీ సునీల్ కూడా.. ''కలిసి ముందుకు సాగే ప్రయత్నం చేయాలి'' అని ముక్తాయించారు.