- ఆరోగ్య శిబిరాలను కూడా నిర్వహించాలి
- జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
ఎన్‌టీఆర్ జిల్లా: జిల్లాలోని 16 బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలని.. అదేవిధంగా వైద్య శిబిరాలు కూడా నిర్వహించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఆదేశించారు.
మంగళవారం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. కలెక్టరేట్‌లో జువైనల్ జస్టిస్ రూల్స్ 41(8) ప్రకారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి తనిఖీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 16,17న అన్ని బాలల సంరక్షణ కేంద్రాల్లో తనిఖీలు, వైద్య శిబిరాల నిర్వహణ, ఆధార్ లేని బాలలకు ఆధార్ కల్పించటం, బాలలను స్కూల్లో చేర్పించడం తదితరాలపై చర్చించారు.
అదే విధంగా కార్యక్రమంలో భాగంగా బాలల సంరక్షణ కేంద్రాలకు తుది రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. సమావేశంలో డీసీపీవో ఎం.రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు జ్యోతి, డా. మాధవి, డా. రాఘవరావు, ఫ్రాన్సిస్ తంబీ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీసీపీయూ సిబ్బంది, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాకులు తదితరులు పాల్గొన్నారు.

