ఎన్టీఆర్ జిల్లా: మన రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న ప్రతీ రైతు ప్రకృతి వ్యవసాయం చేసేలా అవగాహన కల్పించాలని అంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంస్థ ఛైర్మన్ రిటైర్డ్. I.A.S విజయ్ కుమార్ ఈ రోజు జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వై శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ఎన్టీఆర్ లోని APAO ఆఫీస్ విజయవాడలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఏ.పి.సి.ఎన్.ఎఫ్ ఛైర్మన్ రిటైర్డ్. I.A.S విజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులు ప్రకృతి వ్యవసాయం గురించి స్పందించిన సమాచారం గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీనియర్ సలహాదారులు రిటైర్డ్. I.A.S రాయుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ జిల్లాలోని రైతులు అందరిలో కూడా ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగేలా సిబ్బంది యొక్క అన్నీ రకాల పంటలు, సాగు చేస్తున్న ఏ గ్రేడ్ మరియు ఏటీఎం మోడల్స్ ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి మాట్లాడుతూ అందరూ రసాయన రైతులు కొడ ప్రకృతి వ్యవసాయంలోకి రావలని తెలిపారు. జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ బాలాజీ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయని మనం చేసింది మనం నమ్మాలి చేసింది మనం చేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై.శంకర్ నాయక్, జేడీఏ విజయకుమారి, DHO బాలాజీ కుమార్, HO వేణుమాధవ్, ఆర్పీసీ అరుణ, ప్రకృతి వయసాయ సిబ్బంది పాల్గొన్నారు.
_11zon.jpeg)
