Hot Posts

6/recent/ticker-posts

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి


ఏలూరు జిల్లా, ముదినేపల్లి మండలం: ముదినేపల్లి మండలంలోని మదినేపల్లి పెయ్యేరు కాలనీలో నివాసం ఉంటున్న ఆలమూరు స్వామి (ఇస్త్రీ వృత్తి) గుండెపోటుతో ఈరోజు ఉదయం అకస్మాత్తుగా మృతి చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన ఇద్దరు చిన్నపిల్లలతో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనాధారంగా ఇస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు.


ఆయన మరణ వార్త తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి స్పందించి, తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా మృతుడి కుటుంబానికి సహాయాన్ని అందజేశారు. అంత్యక్రియల నిమిత్తం రూ.5,000/- నగదును కుటుంబ సభ్యులకు అందించి, వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన అంబుల వైష్ణవి మరియు డాక్టర్ మనోజ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి మానవీయ సహాయం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు ప్రశంసించారు.

నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడంలో ముందుండే అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి చర్యలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.