TELANGANA: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లలో నిమజ్జన రోజున స్వామి వారికి ప్రసాదంగా ఉంచిన లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయటం తెలిసిందే. లడ్డూ వేలం అదిరే ధర పలికింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లలో నిమజ్జన రోజున స్వామి వారికి ప్రసాదంగా ఉంచిన లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయటం తెలిసిందే.
గడిచిన కొన్నాళ్లుగా ఈ లడ్డూ వేలంలో పలుకుతున్న ధరలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా జరిగిన లడ్డూ వేలంలో రూ.2.32 కోట్ల భారీ ధర పలకటం సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్ లోని కీర్తి రిచ్మండ్ విల్లా వాసులు ఈ భారీ ధరకు వేలాన్ని నిర్వహించినట్లుగా చెబుతున్నారు. గత ఏడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ వేలం రూ.1.87 కోట్లు పలకటం తెలిసిందే. గత ఏడాది కంటే రూ.45 లక్షలు అదనంగా పలకటం విశేషం.
దీన్ని లడ్డూ వేలం అనకూడదని కమ్యూనిటీకి చెందిన కొందరు చెబుతున్నారు. దీనికి కారణం.. ఈ కమ్యూనిటీలో లడ్డూ వేలానికి సంబంధించి అనుసరించే విధానం మిగిలిన వారికి భిన్నంగా ఉంటుందని వివరిస్తున్నారు. మామూలుగా అయితే.. లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయటం.. ఒకరు కానీ.. ఒక కుటుంబం కానీ.. లేదంటే ఇద్దరు ముగ్గురు స్నేహితులు గ్రూపుగా కలిసి లడ్డూ వేలంలో పాల్గొని ప్రసాదాన్ని సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలో జరిగే వేలాన్ని ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వెళుతుంటారు.
రిచ్మండ్ విల్లాలో మాత్రం.. ఈ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ తమ శక్తికి తగ్గట్లుగా భారీగా విరాళాల రూపంలో లడ్డూ ప్రసాదం వేలానికి అందిస్తారని చెబుతారు. దీనికి కారణం.. ఇలా సేకరించే భారీ మొత్తాన్ని పేద విద్యార్థులు.. కుటుంబాలకు సాయం చేసేందుకు వీలుగా ఖర్చు చేయటమే.
పేరుకు గణేశుడి లడ్డూ వేలం అన్న పేరుతో చేసే ఈ సమాజ సేవ.. ఆ కమ్యునిటీలో నివసించే సంపన్నులంతా తమ శక్తికి తగ్గట్లు ఉదారంగా డబ్బులు ఇస్తుంటారని చెబుతారు. ఈ కారణంగా.. ఏడాదికేడాదికి లడ్డూ వేలం పేరుతో జరిపే కార్యక్రమానికి సమకూరే నిధులు రికార్డు స్థాయిలో ఉంటున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా..లడ్డూ వేలం వేళ రూ.2,31,95,000 పలకటం మాత్రం ఒక రికార్డుగా చెప్పక తప్పదు.