Hot Posts

6/recent/ticker-posts

రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు


బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రావులపాలెంలో గురుపూజోత్సవం సందర్భంగా శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల కమిటీ చైర్మన్ పోతంశెట్టి కనికి రెడ్డి, సి ఆర్ సి ప్రెసిడెంట్ నాగమోహన్ రెడ్డి, సత్య సాయి సంస్థల అధ్యక్షులు మన్యం పర్వత వర్ధన్ విచ్చేశారు. 

అనంతరం గవర్నమెంట్ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ పోతంశెట్టి కనకిరెడ్డి, జక్కంపూడి రామకృష్ణ, కొవ్వూరి వెంకటరెడ్డి, పిచ్చెట్టి చిన్నారావు, కంచర్ల మాణిక్యాలరావు, దుల్ల వెంకటేశ్వరరావు, చిన్న కె.వి, నాగ శేఖర్ రెడ్డి, పడాల కృష్ణారెడ్డి తదితరులు ముందుగా భారతదేశ ఉపరాష్ట్రపతిగా పని చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని గురుపూజోత్సవ దినోత్సవ సందర్భంగా సత్కరించారు. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. గొప్ప పండితుడు భారతరత్న తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే టీచర్స్ డే గా భారతీయులు అందరు జరుపుకుంటున్నారని, దాని వెనక ఒక కారణం ఉందని నిజానికి రాధాకృష్ణన్ ఒక గొప్ప ఫిలాసఫర్ మానవవాది మాత్రమే కాదు ఆయన గొప్ప పండితుడు కూడా. 

సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962లో రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయములో అతని వద్ద చదువుకున్న విద్యార్థులందరూ కలిసి అతని పుట్టిన రోజును సెప్టెంబర్ 5న ఘణంగా జరపాలనుకున్నారు. ఇందుకు మీ బర్తడే వేడుకల మేము చేసుకోవచ్చా మాస్టారు అని వారందరూ కలిసి రాధాకృష్ణను అడిగారు. వారికి బదిలిస్తూ తన జన్మ దిననాన్ని ప్రత్యేకంగా జరుపుకునే బదులు సెప్టెంబరు ఐదున ఉపాధ్యాయుల దినోత్సవంగా పాటిస్తే అది తనకు ఎంతో గర్వకారణమని రాధాకృష్ణన్ తెలిపారు. అలా ఆరోజు నుంచి రాధాకృష్ణన్ జన్మ దినం సెప్టెంబర్ 5న భారతీయులందరూ టీచర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది అని అన్నారు. 

అనంతరం కాలేజీ కమిటీ చైర్మన్ పోతంశెట్టి కనికి రెడ్డి మాట్లాడుతూ.. మనం జీవితంలో ఉన్నత స్థాయి గురువుకు ఇస్తాము. అజ్ఞానమనే చీకటిలో ఉన్న వారిని విజ్ఞానమే మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తి గురువు. ఏ దానం చేసిన కరిగిపోతుంది కానీ విద్యాదానం చేస్తే తుది శ్వాస వరకు వారితోనే ఉంటుందని అలాంటి గొప్ప దానాన్ని చేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులని సాక్షాత్తు ఆ పరబ్రహ్మతో పోల్చాలని అన్నారు. పెద్దలు జీవితంలో స్థిరపడడానికి జీవితంలో గొప్పగా కొనసాగడానికి విలువైన పాఠాలు నేర్చుకోవడంలో గురువుల తర్వాతే ఎవరైనా అని కొనియాడారు. 

మన్యం పర్వత వర్ధన్ మాట్లాడుతూ రాను రాను ఉపాధ్యాయుల అంటే తగ్గిపోతున్న గౌరవ మర్యాదలు పెరిగేలాగా విద్యార్థులకు విద్యార్థి దశలో ఉపాధ్యాయుని పాత్ర గురించి, తల్లిదండ్రుల బాధ్యత గురించి, విద్యార్థుల శ్రేయస్సుకు ఉపాధ్యాయులు చేసే కృషిని తెలుసుకోవాలని అన్నారు.