Hot Posts

6/recent/ticker-posts

రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన నల్లా వెంకటేశ్వరరావు, (వెంకన్న) సోమవారం కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సంధిపూడి నుంచి,జనసేన నాయకులు, కార్యకర్తలతో కల్సి బయలుదేరిన ఆయన వాడపాలెం చేరుకుని ముందుగా బండారు శ్రీనివాస్ స్వగృహంలో ఆయనను కలిసి తనకు వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షునిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తగిన సేవలందించి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని వెంకన్నకు బండారు శ్రీనివాస్ సూచించారు. అనంతరం వాడపాలెంలోని ఎమ్మెల్యే బండారు స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులను కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేశారు. వెంకన్నను వారిరువురు అభినందించారు. 

సంగీత సుభాష్,తోట భవాని వెంకటేశ్వర్లు,తోలేటి సంతోషి అంజిబాబు, గారపాటి శ్రీనివాస్ చౌదరి,పెద్దిరెడ్డి పట్టాభి, సలాది జై ప్రకాష్ నారాయణ, బైరిశెట్టి రాంబాబు, దొడ్డ సత్తిపండు, దొడ్డ పుల్లయ్య, పళ్ళ ప్రసాద్, M, రాంబాబు, పోలా బత్తుల అంజి బాబు, పి, నాగు,పి మని, సలాది వెంకన్న, గేదెల గంగయ్య, ఎస్ మూల స్వామి, సలాది శ్రీను, పామర్తి శ్రీను, పామర్తి పల్లంరాజు, ఎస్ గంగరాజు, కీర్తి శ్రీనివాస్,M విజయ్, K విందు, పసుపులేటి వీరబాబు, V వీరబాబు, సామశివ,U వెంకన్న, నల్లా బ్రదర్ ఈ కార్యక్రమంలో కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు.
Author

Vijaya Babu. I

Staff Report | Konaseema