ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగపూర్ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం కలగలేదని, గత ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు పాలనలో ఎటువంటి మార్పు కనిపించడం లేదని ఆయన దుయ్యబట్టారు.
21 సార్లు ఢిల్లీకి వెళ్లినా, కేంద్రం నుండి రాష్ట్రానికి ఏమి సాధించారో చంద్రబాబు స్పష్టంగా చెప్పాలి" అని రామకృష్ణ డిమాండ్ చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం "డబుల్ ఇంజిన్ సర్కార్" అని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి ఏమిటో స్పష్టంగా వివరించాలని ఆయన సవాల్ విసిరారు.
రాష్ట్ర ప్రజలు మార్పును ఆశించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, పాత పద్ధతులే కొనసాగుతున్నాయని, కేవలం పర్యటనలు, ప్రకటనలకే పరిమితం అవుతున్నారని రామకృష్ణ పరోక్షంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.