Hot Posts

6/recent/ticker-posts

దీనికంతటికీ కారణం ఆ ఎమ్మెల్యే- అసలు గుట్టు?

 

ANDHRAPRADESH:శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీ వీడింది. ఇటీవలే చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో అయిదుమందిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ ఛార్జి వినుత కోట, ఆమె భర్త చంద్రబాబు, గోపి, శివకుమార్, షేక్ అరెస్ట్ అయ్యారు.

కారు డ్రైవర్ హత్య గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారణ జరుపుతారని సమాచారం. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్ గా, పీఏగా కూడా పనిచేశాడు.

చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. మృతుడి చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినుత పేరు ఉండడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో ఈ నెల 8వ తేదీన రాయుడిని హత్య చేసి నదీలో పడేసినట్లుగా తెలుస్తోంది.

ఈ హత్య కేసు ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో జనసేన పార్టీ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. కోట వినూతను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చీఫ్ వేములపాటి అజయ్ కుమార్ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. 

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జీగా ఉన్న వినుత కోటను కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచినట్లు తెలిపారు. ఆమె వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున ఆమెను పార్టీకి దూరంగా ఉంచామని వివరించారు. వినుతపై హత్యకేసు ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని, ఆమెను పార్టీనుంచి బహిష్కరించినట్లు చెప్పారు.

కాగా- చెన్నై పోలీసుల కస్టడీలో ఉన్న కోట వినుత, చంద్రబాబు, మిగిలిన ముగ్గురు నిందితులను శనివారం రాత్రి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఆ సమయంలో కోట వినూత, చంద్రబాబు మీడియాతో మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినూత చెప్పారు.

దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు కోట వినూత ఉన్నారు అని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు కల్పించుకుని.. బొజ్జల సుధీర్ రెడ్డి (టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే) ఉన్నాడని తెలిపారు

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi