Hot Posts

6/recent/ticker-posts

రేపు 'తల్లికి వందనం' రెండో విడత నిధులు- లాస్ట్ ఛాన్స్, చెక్ చేసుకోండి..!!


ANDHRAPRADESH:ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదలకు సిద్దమైంది. రేపు (గురువారం) ఏపీ ప్రభుత్వం రెండో విడత నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. అర్హత ఉండీ.. నిధుల జమ కాని వారికి మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2వ తేదీ వరకు పాఠశాలల్లో చేరిన వారికి పథకం అమలు చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రెండో విడత అర్హుల జాబితాలను సచివాలయాల్లో అందుబాటు లో ఉంచారు. కాగా, దీని ద్వారా ప్రభుత్వం హామీ పూర్తి స్థాయిలో అమలు అవుతుందని భావిస్తోంది.

రేపే నిధులు 

తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదలకు రంగం సిద్దమైంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు రెండో విడతలో లబ్ధి పొందనున్నారు. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ చేరిన విద్యార్థులకు రెండో విడతలో తల్లికి వందనం నిధులు అందుతాయి. అలాగే మొదటి విడతలో అర్హుల జాబితాలో ఉన్నా ఒకే కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉన్నవారు, ఆధార్‌ నంబర్లు సరిగా నమోదుచేయని సుమారు లక్ష మందికి గత నెలలో జమను పెండింగ్‌లో ఉంచారు. వారికి కూడా ఇప్పుడు విడుదల చేయనున్నారు. విద్యాహక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన 46 వేల మంది విద్యార్థుల నగదును వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించనున్నారు.

10 లక్షల మందికి

దాదాపుగా 11 లక్షల మంది వివరాలను పాఠశాల విద్యాశాఖ సచివాలయాల శాఖకు పంపింది. అర్హతల వడపోత అనంతరం సుమారు 10 లక్షల మందికి పథకం అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తల్లికి వందనం పథకం నిధులను గత నెల 12వ తేదీన విడుదల చేసింది. దాదాపు గా 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలుచేశారు. అడ్మిషన్లు ఇంకా జరుగు తున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈనెల 10న మెగా పేరెంట్‌-టీచర్స్‌ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం ఈ నెల 10వ తేదీ ముహూర్తం గా ఖరారు చేసింది. 10వ తేదీన రెండో విడత నిధులు విడుదల కానున్నాయి.

చెక్ చేసుకోండి

కాగా, ఇప్పటివరకూ ఒకటో తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్‌ ఫస్టియర్‌లో 4.7లక్షల మంది విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, సెకండ్‌ ఫేజ్‌లో మీ పేరు ఉందో తెలుసుకోవడానికి https://gsws-nbm.ap.gov.in/ సంప్రదించాలి. రెండో విడత లబ్ధి దారుల జాబితాలో పేరు ఉందో, లేదో రెండు విధాలుగా తెలుసు కొనే అవకాశం కల్పించారు. ప్రభుత్వ వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/ ఓపెన్ చేసి తల్లికి వందనం పథకాన్ని సెలక్ట్ చేసుకుని.. విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ పథకానికి అర్హులా, కాదా అన్నది తెలుసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ నంబర్ +91 9552300009 ద్వారా తల్లికి వందనం పథకం రెండో జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now