Hot Posts

6/recent/ticker-posts

వీఐపీలకు దర్శనం, టీటీడీ నిధులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు..!!


ANDHRAPRADESH:మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్ సైతం శ్రీవారని దర్శించుకున్న వారిలో ఉన్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాతృశ్రీ తరి గొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించిన వెంకయ్య నాయుడు నిర్వహణ పట్ల అభినందించారు. వీఐపీల దర్శనం.. టీటీడీ నిధుల వినియోగం పైన వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేసారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించటం ఆనందదాయకంగా ఉందని వ్యాఖ్యానించారు. అన్నప్రసాదాన్ని చాలా చక్కని రుచితో పాటు శుచిగా చేస్తున్నారని ప్రశంసించారు. నిత్యం వేలాది మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదం అందజేస్తున్నఈ కేంద్రం నిర్వహణా బృందానికి అభినందనలు తెలిపారు. ఈ స్పూర్తిని అన్ని ఆలయాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో మరి కొన్ని కీలక సూచనలు టీటీడీ అధికారులకు చేసారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు మాత్రమే వినియోగించాలని వెంకయ్య నాయుడు సూచించారు.

అదే విధంగా తిరుమలకు దర్శనం కోసం వచ్చే వీఐపీల విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతి ఊరిలో ఓ గుడి, బడి ఉండాలని కోరారు. ప్రతి గ్రామంలో ఓ ఆలయాన్ని ఏర్పాటు చేయడా నికి టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు ముందుకు రావాలని సూచించారు. బడులను ఏర్పాటు చేయడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. వీఐపీలు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే స్వామివారి దర్శనానికి రావాలని పేర్కొన్నారు. టీటీడీ అధికారులు సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందు కు సహకరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు ఈ విధానాన్ని తప్పకుండా పాటించాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. తిరుమలలో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవలకుతోనూ వెంయ్య మాట్లాడారు. వారు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి సేవలను వెంకయ్య ప్రశంసించారు.