HYDERABAD:తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. తెలంగాణలోని 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు దసరా పండగ కానుకగా చీరలను పంపిణీ చేయనుంది. ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 318 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది.
తెలంగాణలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 318 కోట్లను ఇప్పటికే విడదల చేసింది. ప్రస్తుతం 1.25 కోట్ల మీటర్లతో 20 లక్షల చీరల తయారీ పూర్తయినట్లు సమాచారం. మరో 45 లక్షల చీరల ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ మేరకు సిరిసిల్లలో ప్రతి రోజూ 5 వేల మంది కార్మికులు చీరల తయారీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దసరా నాటికి మొత్తం చీరల తయారీని పూర్తి చేసి మహిళలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
మహిళా స్వయం సహాయక సభ్యులకు ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం రెండు గుడ్ న్యూస్ లు చెప్పింది. త్వరలోనే వడ్డీ లేని రుణాలను అందిస్తామని పేర్కొంది. అంతేకాక ప్రమాద బీమా పథకం పైన తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్త్రీ నిధి ద్వారా బీమా అమలును కొనసాగించాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది.
అంతేకాక తాజాగా మరొక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త స్టాంపు డ్యూటీ చట్టాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ కొత్త సవరణ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. అయితే కొత్త సవరణ బిల్లులో మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా వారికి స్టాంప్ డ్యూటీ తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi