అసలు ఫోన్ ట్యాపింగ్ చేసారో లేదో మాకేలా తెలుస్తుందని అన్నారు జగన్. ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదంపై స్పందించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి సంబంధించి నీళ్లు నాగార్జున సాగర్ కు పంపించాల్సిన అవసరం లేకుంటే రాయలసీమకు పూర్తిగా వాడుకోవచ్చని అన్నారు. పోలవరం కెనాల్ ద్వారా ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు తీసుకు రాగాలగాలని...ఆ నీళ్లను సాగర్ ఆయకట్టుకు ఇవ్వగలగాలని అన్నారు జగన్.
కాగా.. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఫోన్ ట్యాపింగ్ జగన్, కేసీఆర్ ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ వేశారని షర్మిల ఆరోపించారు.బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న..ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం..తన ఫోన్, తన భర్త, కుటుంబ సభ్యులను ట్యాపింగ్ చేశారన్నారు షర్మిల. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని షర్మిల కోరారు.
రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలన్నారు షర్మిల. అనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి.. రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వైవీ సుబ్బారెడ్డే స్వయంగా చెప్పారని.. ఆనాడు ట్యాపింగ్ జరిగిన ఓ ఆడియోను నాకు వినిపించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నారు షర్మిల.